
ChatGPT: టెక్ ప్రపంచంలో ప్రపంచ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసిన టెక్నాలజీ ఏఐ. ఏఐ రంగంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న ప్రసిద్ధ సంస్థ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ. అయితే తాజాగా ఈ సంస్థ తన ఉద్యోగుల వాటాలను భారీ వాల్యుయేషన్ వద్ద విక్రయించాలని చూస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది.
సెకండరీ స్టాక్ సేల్ ద్వారా కంపెనీలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులతో పాటు పూర్వ ఉద్యోగులు తమ వాటాలను విక్రయించి క్యాష్ చేసుకునేందుకు ఏఐ దిగ్గజం వీలు కల్పించే పనిలో ఉందని తేలింది. అయితే వీటి విలువ అనేక బిలియన్ డాలర్లుగా ఉంటుందని తేలింది. ఏఐ దిగ్గజ సంస్థ వాటాల విక్రయం ద్వారా 500 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.42 లక్షల కోట్ల వాల్యుయేషన్ టార్గెట్ చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీతో పనిచేస్తున్న బ్యాంకింగ్ సంస్థలు ఉద్యోగుల వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
►ALSO READ | MPC Meeting: వడ్డీ రేట్లలో 'NO' ఛేంజ్.. RBI నిర్ణయంతో సామాన్యులు షాక్..
గతంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ నుంచి 40 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించిన రౌండ్‌లో OpenAI విలువ 300 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవల ఆ రౌండ్ రెండవ దశలో భాగంగా కంపెనీ పెట్టుబడిదారుల నుంచి 8.3 బిలియన్ డాలర్లను అందుకుంది.- ఈ ఆఫర్ ఐదు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడిందని వెల్లడైంది. ప్రస్తుతం చాట్ జీపీటీ వారానికి 7 కోట్ల యాక్టివ్ యూజర్లను చేరుకునే దిశలో ఉన్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 4 రెట్లు పెరుగుదలను సూచిస్తోంది. ప్రస్తుతం చాట్ జీపీటీ ఫ్రీ, ప్లస్, ప్రో, ఎంటర్ ప్రైజ్, టీమ్, ఎడ్ వేరియంట్ల కింద సేవలను ఆఫర్ చేస్తోంది.