హైదరాబాద్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో సమా ఏంజెల్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో సమా ఏంజెల్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌ లీగ్‌‌‌‌ నాలుగో సీజన్‌‌‌‌లో సమా ఏంజెల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్‌‌‌‌ఫైనల్లో సమా ఏంజెల్స్‌‌‌‌ 80–0తో ట్యూటరూట్​పై ఏకపక్ష విజయం సాధించింది.

ట్యూటరూట్​తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌‌‌‌ల్లోనూ గెలిచిన సమా టీమ్‌‌‌‌ కొత్త రికార్డును సృష్టించింది. హెచ్‌‌‌‌పీజీఎల్‌‌‌‌, టీపీజీఎల్‌‌‌‌లో నాకౌట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో అన్ని మ్యాచ్‌‌‌‌లు నెగ్గిన ఏకైక జట్టుగా నిలిచింది. బుధవారం జరిగే సెమీస్‌‌‌‌లో సమా ఏంజెల్స్‌‌‌‌.. డీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టీమ్‌‌‌‌తో తలపడుతుంది. ఇందులో నెగ్గిన టీమ్‌‌‌‌ 24న బ్యాంకాక్‌‌‌‌లో జరిగే ఫైనల్‌‌‌‌ పోరుకు అర్హత సాధిస్తుంది.