
ముషీరాబాద్, వెలుగు: కులగణన సర్వే రిపోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపణలు వస్తున్నాయని, రిపోర్టుపై సమీక్ష జరపాలని సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి డిమాండ్ చేశారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. నల్గొగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ వెంకట్ రాజయ్య, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్లుకు పార్టీ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ విద్య, వైద్యం అందాలన్నారు. ఇటీవల అయోధ్యలో దళిత మహిళలపై అత్యాచారం చేసి చంపిన నేరస్తులకు త్వరగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు బాబుగౌడ్, రిజ్వాన్, వాజిద్, శ్రీహరి, రాములు తదితరులు పాల్గొన్నారు.