
టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి హాలిడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తోంది. సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ కోసం విరామం ప్రకటించాక వరుస ట్రిప్స్తో బిజీగా ఉంది . అలాగే తన హెల్త్ స్టేటస్ను అభివృద్ధి చేసుకోవడానికి..మనసు ప్రశాంతతో ఉండటానికి ప్రపంచంలోని అందమైన ప్రదేశాలన్నీ చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది.
లేటెస్ట్గా సామ్ ఎంటీవీ (MTV) నిర్వహించే హస్టిల్ సీజన్-3(Hustle season3)కి జడ్జ్గా వెళ్లి..ఫుల్ జోష్లో కనిపించింది. హైదరాబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ ర్యాపర్ కేడేన్‌శర్మ (Kayden Sharma) పాల్గొన్నఈ ఎపిసోడ్ లో..సమంత డ్యాన్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్ను హుషారెక్కించేలా జోష్ పెంచేసింది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో సమంత తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇందులో హీరోయిన్ సమంతతో..కేడెన్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రోమోలో కేడెన్ టీమ్ ర్యాప్ పాడుతున్న టైంలో సమంత తన సీటులోంచి లేచి మరి డాన్స్ చేయడంతో ఫ్యాన్స్ గా స్పెషల్ ట్రీట్ అని చెప్పుకోవొచ్చు. అంతేకాకుండా..సమంత స్టేజ్ పైకి వచ్చి మరీ..ర్యాపర్స్ తో స్టెప్పులేసి అసలైన ఆనందాన్ని పొందినట్లు తెలుస్తోంది. గత 4 నెలలుగా సమంతలో ఇంతటి ఆనందం చూడలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే సమంత లో అంత ఉత్సాహం నింపిన కేడెన్ శర్మ ర్యాప్ కి ఫిదా అవుతున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ తెలుపుతున్నారు. ఈషోలో సమంతతో స్టేజ్ పై డాన్స్ చేయించిన కేడెన్ శర్మ పూర్తీ ఎపిసోడ్ ను చూసేందుకు ఎంటీవీ ప్రేక్షకులతో పాటు..తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్గా హైదరాబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ ర్యాపర్ కేడేన్‌శర్మ ఎంటీవీ హస్టిల్ సీజన్-3 (MTV Hustle season3)లో అదరగొట్టేశాడు. తన పాటతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు. అతడి పర్ఫార్మెన్స్ కు జడ్జెస్ సైతం అవాక్కయ్యారు.ఈ 23 ఏళ్ల హైదరాబాదీ ర్యాపర్ మ్యూజికల్ మ్యాజిక్ షోకు వచ్చిన ప్రేక్షకులు శివాలెత్తిపోయారు.
గతంలో మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎంతో మంది ప్రముఖులు కేడెన్ శర్మ షో గురించి, ఆయన ర్యాప్స్, సక్సెస్ ల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా సమంత గ్లామర్ కూడా కేడెన్ శర్మకి ఆయన ర్యాప్ కి తోడవ్వడంతో ఈ షోకి మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని ఆడియన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది.