
నాగచైతన్య, సమంత విడాకుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తమ విడాకులపై చై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సమంత పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ఒకటి ఆసక్తికరంగా మారింది. ‘మనమంతా ఒక్కటే.. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి’ అనే కొటేషన్‌ను పోస్ట్ చేసింది. దీంతో సామ్ ఈ పోస్ట్ తన మాజీ భర్తను ఉద్దేశించే చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక నాగ చైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు చై. ఈ సందర్భంగా యాంకర్ విడాకుల గురించి ప్రశ్నించగా.. తమ విడాకులకు సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లే కారణమని తెలిపాడు. గతంతో తనకు సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి తీసుకువచ్చి వార్తలు రాశారని, అది మరింత బాధించిందని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన ఈ హీరో వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. చై ఈ కామెంట్స్ చేసిన కొంతసేపటికే సమంత తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో వీరు విడిపోవడానికి వాళ్ళ ఈగోలే కారణం అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.