Samantha Raj: డైరెక్టర్ రాజ్తో సమంత ఫోటోలు..కొత్త ఆరంభం అంటూ పోస్ట్.. లవ్ కన్ఫామ్ చేసిందా?

Samantha Raj: డైరెక్టర్ రాజ్తో సమంత ఫోటోలు..కొత్త ఆరంభం అంటూ పోస్ట్.. లవ్ కన్ఫామ్ చేసిందా?

హీరోయిన్ సమంత (Samantha) లేటెస్ట్గా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత తన నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీ 'శుభం'. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా సామ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేసింది.  "ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ ఇక్కడివరకూ చేరుకున్నాం. కొత్త ఆరంభాలు. శుభం మే 9న విడుదలవుతుంది " అని తన పెంపుడు జంతువులు హాష్, శాషాతో దిగిన ఫోటోలు, సినిమా షూటింగ్ సమయంలోని క్షణాలు, ఇతర ఫోటోలను ఆమె పంచుకున్నారు.

ఇందులో 'కొత్త ప్రారంభం' అనే క్యాప్షన్ మరియు డైరెక్టర్ రాజ్ (Raj Nidimoru) ఫోటో ఆసక్తి పెంచుతోంది. దాంతో సమంత డైరెక్టర్ రాజ్తో ప్రేమలో ఉన్న రూమర్ నిజమనేలా ఉండటంతో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలకు నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. 'సమంత పోస్ట్ చేసిన చిత్రంలో రాజ్ ఉన్నాడు.. ఓ మై గాడ్' అని కామెంట్ చేయగా.. అతనితో సమంత హ్యాపీగా ఉందంటూ మరొకరు కామెంట్ చేశారు. మరొకరు, 'సామ్, దయచేసి ఎవరినీ ప్రేమించవద్దు. అన్నీ నకిలీవి. దయచేసి ఒంటరిగా ఉండి మీ మార్గాన్ని ఆస్వాదించండి' అని కామెంట్ చేశాడు. 

అయితే, గతకొన్నాళ్లుగా సమంత మరియు రాజ్ నిడిమోరు డేటింగ్ చేస్తున్నారని పుకారు ఉంది. కానీ, ఈ ఊహాగానాలపై వారిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందు, సమంత మరియు రాజ్ కొంతమంది స్నేహితులతో కలిసి తిరుమల సందర్శించడం కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. 

ఇకపోతే, సమంత, రాజ్ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల కోసం పనిచేశారు. ఆమె ఇప్పుడు అతనితో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'లో పనిచేస్తున్నారు.  అంతేకాదు.. వీరిద్దరూ  చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికిల్‌బాల్ జట్టుకు కూడా భాగస్వాములు. మరి  వీరిద్దరి మధ్య వచ్చే రూమర్స్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది తెలియాల్సి ఉంది. 

ఈ విషయం ఇలా ఉండగా నటి సమంత 2017లో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ 5 ఏళ్లపాటు కలసి ఉన్నారు. కానీ అనుకోని కారణాలవల్ల పరస్పర అంగీకారంతో 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం సమంత ఒకపక్క సినిమాల్లో నటిస్తూ, నిర్మిస్తూ మరోపక్క బిజినెస్ లో కూడా పెట్టుబడులు పెడుతూ బిజిబిజీగా గడుపుతోంది. అలా సమంత నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’.‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీనికి దర్శకత్వం వహించాడు. వసంత్ మరిగంటి కథను అందించాడు. మే 9న సినిమా రిలీజ్.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.