
మార్వెల్ యూనివర్స్‌కు వరల్డ్‌వైడ్‌గా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే మార్వెల్ మూవీస్ నుంచి వచ్చిన బ్లాక్ పాంథర్, ది ఎవెంజర్స్, స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాయి. ఈ ఏడాది మార్వెల్ స్టూడియోస్ నుంచి రానున్న తాజా చిత్రం ‘ది మార్వెల్స్’ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో ఈ మూవీ స్పెషల్ ప్రోమోను సమంత లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేను మార్వెల్ సూపర్ హీరోస్ సినిమాలకి బిగ్ ఫ్యాన్‌ని. అందులో కెప్టెన్ మార్వెల్ నా ఫేవరేట్. ఈ యూనివర్స్ ప్రోమోను లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఈసారి ఏకంగా ముగ్గురు సూపర్ హీరోస్ చెడుపై పోరాడబోతున్నారు. ఈ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నా. ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్‌లా మార్వెల్స్ మన ముందుకు వస్తోంది’ అని చెప్పింది. దీపావళి సందర్భంగా నవంబర్ 10న ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది.