సారీ చెప్పిన సామ్.. చిరునవ్వుతో రావాలన్న రౌడీ హీరో

సారీ చెప్పిన సామ్..  చిరునవ్వుతో రావాలన్న రౌడీ హీరో

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో కొద్ది రోజులు విరామం తీసుకున్నా ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తున్నారు. అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా 'సిటాడెల్‌' హిందీ రీమేక్‌లో నటిస్తున్న సమంత ఇటీవలే ఆ మూవీ షూట్ లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాకు ఆమె డేట్స్ ఇవ్వడంలేదంటూ కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఓ దీంతో ఓ అభిమాని ఖుషి షూటింగ్ పరిస్థితేంటి? అని సమంతను ప్రశ్నించాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. 'విజయ్‌ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. త్వరలోనే ఖుషి షూటింగ్‌లో పాల్గొంటానని ట్వీట్ చేసింది. 

సమంత ట్వీట్ పై రౌడీ హీరో విజయ్ స్పందించాడు. నువ్వు పూర్తి ఆరోగ్యంతో, చిరునవ్వుతో తిరిగి రావాలని మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ రీ ట్వీట్ చేశాడు.