
సినీ నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన తన పెళ్లినాటి ఫొటోలను తొలగించారు. నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు అక్టోబర్ 2న సామ్, నాగచైతన్య ప్రకటించారు. వీరికి కోర్టు పరంగా ఇంకా విడాకులు మంజూరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజా సమంత తన ఇన్‌స్టా ఖాతా నుంచి చైతన్యతో కలిసి వివిధ సందర్భాల్లో తాను దిగిన ఫొటోలు డిలీట్ చేశారు. రానా ఎంగేజ్‌మెంట్, పెళ్లి వేడుకల్లో చైతన్యతో దిగిన ఫొటోలు, న్యూ ఇయర్ రోజు గోవాలో దిగిన ఫొటోలతోపాటు ఎంగేజ్ మెంట్ , పెళ్లి ఫొటోలను సమంత తొలగించారు. అయితే అక్కినేని, దగ్గుబాటి కుటుంబసభ్యులతో ఉన్న ఫొటోలు మాత్రం అలాగే ఉంచారు.