నిన్ను చూసి గర్వపడుతున్నా.. సమంత పోస్ట్ వైరల్

నిన్ను చూసి గర్వపడుతున్నా.. సమంత పోస్ట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెడుతున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉండే సామ్.. కొద్దిరోజులు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు కదులుతున్నారు. యశోద సినిమా హిట్ తో సామ్ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ఓ వైపు శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంటూనే.. మరోవైపు ‘సిటాడెల్‌’ షూట్‌తో కొత్త ఏడాదిని ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా ఆమె వర్క్‌ లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. జనవరి నెలలో తన జీవితం ఎలా గడిచిందో ఈ ఫొటోలతో చూపారు. ‘సిటాడెల్‌’ టీంతో మీటింగ్‌, వర్కౌట్లు, అలసట, ఫొటోషూట్‌లతో గత నెల పూర్తైందంటూ ఆసక్తికర పోస్టు చేశారు. 

‘‘గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులు అనుభవిస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆలోచించడం మానేశావు.. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు.. సరిగ్గా నడవలేకపోయావు.. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగేశావు. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో’’ అని సామ్‌ తన ఇన్‭స్టాగ్రామ్ పోస్టులో రాశారు.