4 డిగ్రీల ఐస్ గడ్డల మధ్య సమంత యోగా..

4 డిగ్రీల ఐస్ గడ్డల మధ్య సమంత యోగా..

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సామ్ ప్రస్తుతం బాలి విహారయాత్రలో సేద తీరుతున్న విషయం తెలిసిందే. నటనకు దూరంగా ఉంటూ..ప్రకృతి ఒడిలో పరవశిస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా నుంచి షేర్ చేస్తోంది. లేటెస్ట్ గా బాత్ లో స్నానం చేస్తూ..ఫ్యాన్స్ ను విస్మయానికి లోనయ్యే ఫోటో ఒకటి షేర్ చేసింది.. ''మంచు స్నానాలు 4 డిగ్రీల 6 నిమిషాలు'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒణుకు పుట్టిస్తున్న చల్లని నీటిలో స్నానం చేస్తున్న సామ్ డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేస్తూ..ఫ్యాన్స్ ను ఆలోచింపజేస్తూ..ఆకర్షణకు గురి చేస్తోంది.  

సమంత కొన్నాళ్ళు మూవీస్ కు గ్యాప్ ఇచ్చి..బాలి విహారయాత్రలో విహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందే తన ఫ్రెండ్ తో కలిసి.. మంకీ తో దిగిన ఫోటో తో పాటు, బ్రిడ్జ్ పై నిల్చుని..సముద్రాన్ని చూస్తూ  ఆహ్లోదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోన్న ఫొటోస్ ను షేర్ చేసింది సామ్. 

మాయోసైటిస్ అనే వింత వ్యాధితో బాధపడుతున్న సమంత..ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్ళడానికి ముందు ఈ బాలి యాత్రలో సరదాగా గడుపుతోంది. సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి మూవీలో నటించగా..దీంతో పాటు వరుణ్ ధావన్ 'సిటాడెల్' మూవీస్  లో నటించింది. ఈ రెండు మూవీస్ రిలీజ్ కు సిద్ధమవుతోన్నాయి.