
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇవాళ (మార్చి 4న) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.నేడు తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ బ్రేక్ దర్శనం సమయంలో సమంత స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. ఆ తర్వాత సమంత స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేసింది.
సమంత ముందుగా ఇవాళ ఉదయం తిరుచానూరు ఆలయానికి కూడా వెళ్లారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని..ఆ తర్వాత తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంది. ఆలయం నుంచి సమంత బయటికి వచ్చాక..ఆమె చుట్టూ చాలా మంది గుమికూడారు. అంతేకాకుండా కొందరు ఫొటోలు, వీడియోస్ తీసేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం సామ్ తిరుపతికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌత్ బ్యూటీగా సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఇష్టపడే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. కొంతకాలం వరకు అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె..ఈమధ్యే కోలుకున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సినిమాకు రీమేక్ ఇది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తోపాటు మరో రెండు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించనున్నారు సమంత.
Thalaivi @Samanthaprabhu2 arrived in tirumala today afternoon. Had darshan of Lord Venkateswara and took blessings! ??#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/afgyj5vrLF
— ???? ????????™ (@TeamSamantha__) March 4, 2024