
టాలీవుగ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నయా లుక్‌తో తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తాజా విశేషాలను తన ఫ్యాన్స్‌తో పంచుకునే సమంతా తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఓ బీచ్‌వద్ద షార్ట్హెయిర్తో చిరునవ్వులు చిందిస్తూ కనిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ నయా లుక్‌పై హీరోయిన్హన్సిక స్పందిస్తూ.. సమంత ఎప్పటికీ అందంగానే ఉంటుందంటూ కామెంట్ చేసింది. మొత్తానికి సరికొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది సామ్. ఇక సమంత సినిమాల విషయాలకు వస్తే.. శివ నిర్వాణ(Shiva Niravana) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా సామ్ హీరోయిన్ నటిస్తున్న ఖుషి(Khushi) సినిమా తర్వలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.