
సమంతకు శివనిర్వాణ రెండో హిట్టిచ్చాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘మజిలీ’ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ– సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఖుషీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియోన్స్‌తో పాటు, యూత్‌కు బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది.
దీనికి తోడు సినిమాలో విజయ్, సమంతల కెమిస్ట్రీ ప్రధాన హైలెట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు. ఆరాధ్య సాంగ్‌లో వీరి జోడీ చూడ ముచ్చటగా ఉందని చెప్తున్నారు. ఫస్టాఫ్‌లో లవర్స్‌గా, సెకండ్ ఆఫ్‌లో దంపతులుగా వీరిద్దరూ ఆకట్టుకున్నారు. శాకుంతలం వంటి ఫ్లాప్ తర్వాత సమంత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందంటూ ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్న ఈ నటి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.