కేసీఆర్​కు కమ్యూనిస్టుల సత్తా చూపిస్తం: కూనంనేని సాంబశివరావు

కేసీఆర్​కు కమ్యూనిస్టుల సత్తా చూపిస్తం: కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: పొత్తుల విషయంలో సీఎం కేసీఆర్ చరిత్ర క్షమించరాని తప్పు చేశారని, నమ్మకద్రోహం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. వాళ్లు తప్పు చేస్తే తామేమి కుమిలిపోబోమని, మరింత సవాల్​గా తీసుకొని.. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. కసితో పార్టీని పటిష్టం చేసుకునేందుకు, గెలిచేందుకు పనిచేస్తామ న్నారు. గురువారం హైదరాబాద్ మగ్దూంభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇప్పటివరకు ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే స్నేహపూర్వకంగా సలహాలిచ్చామని, ఇకపై మిలిటెంట్ తరహా పోరాటాలు చేస్తామ న్నారు. కమ్యూనిస్టులు మిత్రద్రోహం మరిచినట్లు బీఆర్ఎస్ పత్రికలో రాశారని, అది దొందే దొంగ అన్నట్లుగా ఉన్నదని విమర్శించారు. సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సా యుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.