రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసింది : కూనంనేని సాంబశివరావు

రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసింది : కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్ : రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏడాది పాటు సాయుధ పోరాటంలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తే.. అయితే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. రైతాంగ పోరాట అమరవీరుల పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఎగురవేశారు. పార్టీ జెండాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎగురవేశారు.

అధికారంలోకి వస్తే విలీన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత మాట తప్పారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతాంగ సాయుధ పోరాట అమరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.