కొమురవెల్లిలో సమ్మక్క సారక్క సందడి

కొమురవెల్లిలో  సమ్మక్క సారక్క సందడి

కొమురవెల్లి మండల కేంద్రంలో  సమ్మక్క సారలమ్మ జాతర   బుధవారం ప్రారంభమైంది.  భక్తులు  గద్దెల వద్దకు చేరుకొని  మొక్కులు చెల్లించుకున్నారు.   అమ్మవార్లకు బెల్లం (బంగారం) సమర్పించిన అనంతరం   కోడిపిల్లలు, మేకపిల్లలు బలిచ్చారు. భక్తుల సౌకర్యాలను ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించి అన్ని సౌకర్యాలు కల్పించారు.

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ లో సమ్మక్క, సారక్క జాతర మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.   జోగిని శ్యామల   బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.  మున్సిపల్ ఆధ్వర్యంలో జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 కొమురవెల్లి, రామచంద్రాపురం, వెలుగు