ఇప్పటివరకూ కామెడీ క్యారెక్టర్స్‌తో నవ్వించిన సంపూర్ణేష్ బాబు.. ఈసారి ఇంటెన్స్ క్యారెక్టర్‌తో రాబోతున్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది పారడైజ్’ చిత్రంలో బిర్యానీ అనే కీలకపాత్రను పోషిస్తున్నాడు.
శుక్రవారం తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రక్తంతో తడిసిన చేతులతో రగ్గుడ్ లుక్‌లో కనిపించిన సంపూ, చేతిలో గొడ్డలి పట్టుకుని బీడీ తాగుతూ ఫెరోషియస్ లుక్‌లో సర్‌ప్రైజ్ చేశాడు. నాని పోషిస్తున్న జడల్ పాత్రకు క్లోజ్ ఫ్రెండ్‌గా, వీర విధేయుడిగా సంపూ నటిస్తున్నాడని మేకర్స్ తెలియజేశారు. శికంజ మాలిక్ అనే కీలకపాత్రను మోహన్ బాబు పోషిస్తుండగా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.
