
హైదరాబాద్, వెలుగు: కన్స్యూమర్ఎలక్ట్రానిక్స్బ్రాండ్ శామ్సంగ్ పండుగల సందర్భంగా సూపర్బిగ్సెలబ్రేషన్స్ను ప్రకటించింది. వీజన్ ఏఐతో పనిచేసే ప్రీమియం బిగ్స్క్రీన్టీవీలపై ఈ ఆఫర్లు ఉంటాయి. వచ్చే నెల 31 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పాటు ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు,బహుమతులు పొందవచ్చు. ఈఎంఐలు నెలకు రూ. 990 నుంచి ప్రారంభమవుతాయి.
జీరో డౌన్ పేమెంట్సదుపాయాన్ని వాడుకోవచ్చు. కొన్ని స్కీముల్లో ఒక ఈఎంఐ మినహాయింపు ఆఫర్ఉంటుంది. కొన్ని మోడల్స్బిగ్స్క్రీన్ టీవీ మోడల్స్కొనుగోలుదారులకు ఉచితంగా శామ్సంగ్సౌండ్బార్ (రూ. 92,990 వరకు విలువైనది) లేదా ఏఐ టీవీ (రూ. 1,40,490 వరకు విలువైనది) లభిస్తుంది. కొన్ని బిగ్స్క్రీన్టీవీలపై 3 సంవత్సరాల వారంటీని పొందవచ్చు. ఈ ఆఫర్లు 55, 65, 75, 85, 98, 100, 115 ఇంచుల విజన్ ఏఐ టీవీలకు వర్తిస్తాయి.