కరోనా కేసులు తగ్గుతుండడంతో ఢిల్లీలో ఆంక్షలు డౌన్

కరోనా కేసులు తగ్గుతుండడంతో ఢిల్లీలో ఆంక్షలు డౌన్

కరోనా కేసులు తగ్గుతుండడంతో ఢిల్లీలో ఆంక్షలు సడలిస్తున్నారు. 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందిని తగ్గించడానికి ప్రయత్నించాలని అధికారులు సూచించారు. వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోంకు ప్రియారిటీ ఇవ్వాలన్నారు. మరోవైపు షాపులు తెరవడానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న సరిబేసి విధానాన్ని కూడా రద్దు చేశారు. ఈ ప్రతిపాదనలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు పంపారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అయితే ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. అలాగే వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీలో గత వారం నుంచి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 12 వేలకుపైగా కేసులు వచ్చాయి. జనవరి మొదటి వారంలో 35 వేలకుపైగా వచ్చిన కేసులు అమాంతం తగ్గిపోయాయి. దీంతో కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు సడలిస్తోంది.