ఎన్జీటీ ఆదేశించినా ఆగని ఇసుక తవ్వకాలు..

ఎన్జీటీ ఆదేశించినా ఆగని ఇసుక తవ్వకాలు..

పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. ఇసుక తవ్వకాలు ఆపాలని  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై) ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సుల్తానాబాద్ లో బీజేపీ నాయకులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎన్జీటీలో పిటిషన్ వేసిన గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, ఎస్సై ఉపేందర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇసుక లారీలు ఆపే హక్కు ఎవరిచ్చారని ఎస్సై సురేష్ రెడ్డిని ప్రశ్నించారు.

ఎన్జీటీ ఆదేశాలు తమకు అందలేదని ఎస్సై ఉపేందర్, సురేష్ రెడ్డిపై దురుసుగా ప్రవర్తించారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీల వలన ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. లారీలు ఆపిన వారిని పోలీసులు బెదిరించడం సరికాదని జనం అంటున్నారు.