అంత సూపర్ హిట్ సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ భయ్యా?

అంత సూపర్ హిట్ సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ భయ్యా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సామజవరగమన(Samajavaragamana). రామ్ అబ్బరాజు(Ram abbaraju) దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. 

నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. చాలా రోజుల తరువాత వచ్చిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సామజవరగమన సినిమా చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిని చూపించారు. 

ఇక తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తన్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. సామజవరగమన సినిమా కథను దర్శకుడు రామ్ అబ్బరాజు ముందు యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep kishan) కు చెప్పారట. అయితే అప్పటికే సందీప్ మైఖేల్(maikel) సినిమా చేస్తుండటంతో.. ఈ సినిమాకు నో చెప్పాడట. కానీ సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మైఖేల్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ విషయం తెసులుకున్న సందీప్ కిషన్ ఫ్యాన్స్. మైఖేల్ సినిమా కోసం అంత మంచి సినిమాను వదులుకున్నావ్ ఏంటన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.