80 శాతం మొక్కలు బతకాలె

80 శాతం మొక్కలు బతకాలె
  • లేదంటే సర్పంచ్‌‌‌‌లపై చర్యలు
  • గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సందీప్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సుల్తానియా

సూర్యాపేట, వెలుగు: గ్రామాల్లో నాటిన మొక్కల్లో 80 శాతం సంరక్షించాలని, లేకపోతే సర్పంచ్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సందీప్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సుల్తానియా సూచించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌‌‌‌‌‌‌‌) మండలం ఏపూరులో బుధవారం నిర్వహించిన పల్లెప్రగతిలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌కృష్ణారెడ్డి, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేజ్‌‌‌‌‌‌‌‌ పార్కు, ఆట స్థలం, నర్సరీ, డంపింగ్‌‌‌‌‌‌‌‌ యార్డు, వైకుంఠధామాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పంచాయతీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు పల్లె ప్రగతిలో పాల్గొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తుండడంతో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. చెత్తతో వర్మీ కంపోస్టు, ఎరువులను తయారు చేసి పంచాయతీలకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా కృ-షి చేస్తున్నామన్నారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ నిధులతోనే ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేయడంతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌, జిల్లా ఆఫీసర్లను అభినందించారు. అనంతరం మహిళ సంఘాలకు స్త్రీ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేశ్‌‌‌‌‌‌‌‌, డీపీవో యాదయ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు
తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌‌‌‌‌‌‌ మండలం దిర్శినపల్లి, మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం సమస్యల పరిష్కారానికి వేదికగా మారాలన్నారు. పరిశుభ్రత, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ పనులు నిరంతరం చేపట్టాలని సూచించారు. పల్లెప్రగతి పనుల్లో ఆఫీసర్లు లీడర్లు అలసత్వం వహించొద్దని సూచించారు. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పెన్షన్లు ఇస్తామని, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ గుజ్జ దీపిక యుగంధర్‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీడీఓలు ఇందిర, సరోజ, ఎంపీపీలు కళావతి సంజీవరెడ్డి పాల్గొన్నారు.