Sandeep Sharma: హర్షిత్ రాణాను గంభీర్ సపోర్ట్ చేయడానికి కారణం అదే: సందీప్ శర్మ

Sandeep Sharma: హర్షిత్ రాణాను గంభీర్ సపోర్ట్ చేయడానికి కారణం అదే: సందీప్ శర్మ

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాకు పదే పదే అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలకు గురవుతున్నాడు. హర్షిత్ రానాపై కొన్ని రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ వస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ కు ఎంపికైన హర్షిత్.. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో తుది జట్టులో స్థానం సంపాదించాడు. జట్టులో ఎంపికవ్వడం తన తప్పు కాకపోయినా రానాపై ఈ రేంజ్ లో విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ హర్షిత్ రానాపై ప్రశంసలు కురుస్తున్నాయి. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

హర్షిత్ రానా సూపర్ బౌలింగ్ తర్వాత ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాక్ విత్ మన్వేంద్ర అనే పాడ్‌కాస్ట్‌లో  మాట్లాడిన శర్మ ఇలా  అన్నాడు "మీరు ఒకరి ప్రతిభను గుర్తించినప్పుడు, వారు పరిణితి సాధించడానికి తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. హర్షిత్ రానా విషయంలోనూ అదే జరిగింది. గంభీర్ రానాను నమ్మాడు. అందుకే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడు. హర్షిత్ రానా 140 కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తాడు. అతని హైట్ అడ్వాంటేజ్. శారీరకంగా బాగా దృఢంగా ఉంటాడు. మీరు అతనితో రెండు సంవత్సరాలు పనిచేస్తే చాలా మంచి బౌలర్ కాగలడు". 

"మీరు అలాంటి ఐదుగురు ఆటగాళ్లను నమ్మి అవకాశాలు ఇచ్చినప్పుడు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే బాగా రాణిస్తారు. మూడు లేదా నాలుగు సార్లు మీ అంచనా తప్పు అవుతుంది. అందుకే సెలెక్టర్లు ఫాస్ట్ బౌలర్లను కనుగొని వారిని మెరుగుపర్చాల్సిన అవసరం సెలక్టర్లకు ఉంది. రానా 23 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. అతని ఎదుగుదలకు అవకాశాలు ఇవ్వాలి". అని శర్మ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో ఇటీవలే జరిగిన తొలి వన్డేలో హర్షిత్ అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్ల స్పెల్ లో 65 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఒకే ఓవర్లో డికాక్, రికెల్ టన్ లను డకౌట్ చేశాడు. 

ఏడాది కాలంగా టీమిండియాలో మూడు ఫార్మాట్ లలో హర్షిత్ రానా ఆడుతున్నాడు. ప్లేయింగ్ 11 లో స్థానం సంపాదించకున్నా స్క్వాడ్ లో మాత్రం ఎంపికవుతున్నాడు. ఆస్ట్రేలియాపై జరగబోయే వన్డే, టీ20 స్క్వాడ్ లోనూ హర్షిత్ ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లోనూ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రానాకు వరుస ఛాన్స్ లు ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదు. దీంతో హర్షిత్ పై దారుణంగా ట్రోలింగ్ నడించింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటున్న గంభీర్ ఐపీఎల్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్. మరోవైపు హర్షిత్ కూడా కేకేఆర్ జట్టు తరపున బాగా ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. కేకేఆర్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఆ జట్టులోని రానాకు గంభీర్ వరుస అవకాశాలు ఇస్తున్నాడని నెటిజన్స్ భావించారు.