న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి : విష్ణువర్ధన్ రెడ్డి

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి :  విష్ణువర్ధన్ రెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంతవరకు ఉద్యమం కొనసాగుతోందని చెప్పారు. 

అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేశ్, కార్యవర్గ సభ్యులు మల్లేశం, శ్రీకాంత్, శ్రీనివాస్,  మంజుల రెడ్డి, బుచ్చయ్య, సుభాష్ చంద్ర,  నరసింహ, మాణిక్ రెడ్డి, రాములు, దత్తాత్రి, భాస్కర్ పాల్గొన్నారు.