
- కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ప్రావీణ్య సూచించారు. ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైనట్లు చెప్పారు. జిల్లాలో 1,91,668 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉండగా 1,86,147 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారన్నారు. అమీన్పూర్మున్సిపాలిటీ పరిధిలో పోలియో చుక్కల స్టాక్ లేదనడంలో వాస్తవం లేదన్నారు. అధికారులు అంచనా వేసిన దానికంటే 1500 డోసుల పోలియో చుక్కల మందు ఎక్కువగా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
గతంలో కంటే ఈసారి 60 సెంటర్లు అదనంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోమవారం, మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. కలెక్టర్‌వెంట టీజీ ఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు.
పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ప్రభుత్వ హాస్పిటల్ లో కాంగ్రెస్‌నేత నీలం మధు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
అమీన్‌ఫూర్: పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు వారందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అమీన్‌ఫూర్ కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. జాతీయ పల్స్‌పోలియో దినోత్సవం సందర్భంగా మున్సిపల్ఆఫీసులో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం పోలియోపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.