కారు బోల్తా.. చిన్నారి మృతి ..సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం

కారు బోల్తా.. చిన్నారి మృతి ..సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం

పుల్కల్, వెలుగు: షిరిడి దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా కారు యాక్సిడెంట్ లో బాలిక మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన తాళ్ళ గౌతమ్ గౌడ్ కుటుంబసభ్యులతో కలిసి కారులో మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రం సమీపంలో నేషనల్ హైవే –161 పై శుక్రవారం తెల్లవారుజామున కారు టైరు పేలడంతో  అదుపుతప్పి బోల్తాపడింది. 

గౌతమ్ గౌడ్ కుటుంబ సభ్యులకు స్వల్ప గాయా లు, కాగా కూతురు శ్రీత(3) తీవ్రంగా గాయపడింది. 108లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ చనిపోయింది. గౌతమ్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.