అనుమతి లేకుండా అల్లోపతి వైద్యం.. క్లీనిక్ సీజ్

అనుమతి లేకుండా అల్లోపతి వైద్యం.. క్లీనిక్ సీజ్

ఝరాసంగం.వెలుగు: అనుమతులు లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న మహాపాలి క్లినిక్​ను సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ఓ నాగ నిర్మల సీజ్​చేశారు. మంగళవారం ఝరాసంగం మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్​లో ఆకస్మిక తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్​ఎంపీ క్లినిక్​లో బెడ్లు ఏర్పాటు చేసి రోగులను అడ్మిట్​ చేసుకుని అనుమతి లేని అల్లోపతి వైద్యం చేయడం నియమాలకు విరుద్దమన్నారు. దీంతో మహాపాలి క్లినిక్​ను సీజ్​ చేశామన్నారు. అక్కడి నుండి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ల్యాబ్​ను పరిశీలించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. ఆమె వెంట స్థానిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు రమ్య, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.