కెనడియన్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ టోర్నీ.. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌కు సానియా

కెనడియన్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ టోర్నీ.. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌కు సానియా

హైదరాబాద్‌‌‌‌: ఇండియా టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌‌‌ సానియా మీర్జా తన కొత్త డబుల్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ మాడిసన్‌‌‌‌ కీస్‌‌‌‌తో తొలి టైటిల్‌‌‌‌ నెగ్గేందుకు మరో అడుగు ముందుకేసింది. కెనడియన్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ 1000 టోర్నమెంట్‌‌‌‌లో సానియా–కీస్‌‌‌‌ (అమెరికా) జంట విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సెమీఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఈ ఇండో–అమెరికన్‌‌‌‌ జోడీ 7–5, 3–6, 10–6తో సోఫియా కెనిన్‌‌‌‌ (అమెరికా)–యులియా పుతిన్సెవా (కజకిస్తాన్‌‌‌‌) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌‌‌‌లో సానియా–కీస్‌‌‌‌ జంట నాలుగు ఏస్‌‌‌‌లు కొట్టింది. నాలుగు బ్రేక్‌‌‌‌ పాయింట్లు నెగ్గింది. సెమీస్‌‌‌‌లో సానియా జోడీ మూడో సీడ్‌‌‌‌ కొకొ గాఫ్‌‌‌‌–జెసికా పెగులా (అమెరికా) ద్వయంతో పోటీ పడనుంది.