గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం : కల్వకుంట్ల సంజయ్​

గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం  : కల్వకుంట్ల సంజయ్​
  • కోరుట్ల బీఆర్ఎస్​ అభ్యర్థి  డాక్టర్​ కల్వకుంట్ల సంజయ్​ 

 కోరుట్ల, మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : కేసీఆర్ ​నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కోరుట్ల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్​ అభ్యర్థి డాక్టర్​కల్వకుంట్ల సంజయ్​ అన్నారు. సోమవారం కోరుట్లలోని  బిలాల్​పురా, ఐబీ రోడ్డు, గడి గురుజు మార్కెట్​, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, బాబు జగ్జీవన్​ రాం విగ్రహం, హాజీపురా ఉర్దూగర్​ వద్ద కార్నర్ మీటింగ్‌‌‌‌లో ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి  సంజయ్​ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్​ టైంలో ఓట్ల కోసం వచ్చే వారి మాటలు నమ్మొద్దని, అందుబాటులో ఉండి సమస్యలను తీర్చేవారిని ఎన్నుకోవాలన్నారు.

బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలకు తాగునీటి సమస్య తీర్చిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు జీవనభృతి అందజేస్తోందన్నారు. ఎంపీగా గెలిచిన అర్వింద్​ కోరుట్ల నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేశామన్నారు.

తన కొడుకు సంజయ్​ను గెలిపిస్తే తన కంటే రెండింతలు అభివృద్ధి చేస్తాడని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సంజయ్‌‌‌‌ను గజమాలతో సన్మానించారు. అంతకు ముందు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​పర్సన్​ లావణ్య, కౌన్సిలర్లు , లీడర్లు పాల్గొన్నారు.   

ALSO READ :    ఎమ్మెల్యే గువ్వల దిష్టిబొమ్మ దహనం 

అభివృద్ధి వైపు నిలబడండి

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి చేశానని, ఓటేసి అభివృద్ధికి అండగా నిలబడి సంజయ్‌‌‌‌ను గెలిపించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం మల్లాపూర్​ మండలం లోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ , ఎంపీటీసీ ముత్తమ్మ , జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ సరోజన, లీడర్లు మల్లయ్య , ఆదిరెడ్డి, మహిపల్, గంగారెడ్డి పాల్గొన్నారు.