తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ రిలీజ్

 తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ రిలీజ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలు నుంచి రిలీజయ్యారు.  ఏప్రిల్ 02వ తేదీన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా ఆయన రిలీజయ్యారు.   విడుదల అనంతరం..  సంజయ్ సింగ్ మాట్లాడుతూ..  తమ పార్టీలోని అతిపెద్ద నాయకులు - అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ - లు కూడా బయటకు వస్తారన్న నమ్మకం తనకుందాన్నారు. అందుకే ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని, ఇది కష్టపడాల్సిన సమయం అని తెలిపారు.  

గతేడాది అక్టోబర్ లో సంజయ్ సింగ్‌ను  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.  జైలు నుంచి విడుదలైన సంజయ్ సింగ్ నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతను కలుసుకుని ఆమె ఆశీర్వా్దం తీసుకోనున్నారు.  ఆ తర్వాత ఆయన ఆప్ కార్యాలయానికి వెళ్లి అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.   

ఆప్ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లతో సహా అగ్రనేతలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆప్‌కి సంజయ్ సింగ్‌కు బెయిల్ కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పాలి.  కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్  చేసింది.  ఏప్రిల్ 15 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.