జస్టిస్ సంజీవ్ ఖన్నా అనబడే నేను.. ‘సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా’

జస్టిస్ సంజీవ్ ఖన్నా అనబడే నేను.. ‘సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా’

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము ప్రమాణ ప్రమాణం చేయించారు. సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నుంచి జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పదవీకాలం మే 13, 2025 వరకు కొనసాగనున్నారు. అక్టోబరు 16న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సిఫారసు మేరకు అక్టోబర్ 24న జస్టిస్ ఖన్నా నియామకాన్ని కేంద్రం అధికారికంగా తెలియజేసింది.