బ్యాట్ స్ మన్‌గా రన్స్ చేయడంలో విఫలమైన శాంసన్.. ఫీల్డర్ గా మాత్రం అదరహో అనిపించాడు. ఠాకూర్ వేసిన 8వ ఓవర్ లో సిక్సర్ కోసం టేలర్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన భారీ షా ట్ ను శాంసన్ ఊహకందని రీతితో అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద కుడివైపు డైవ్ చేస్తూ బాల్ ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. కానీ అదే క్రమంలో బ్యాలెన్స్ తప్పుతున్నానని నేర్పుగా బంతిని రోప్ లోపలికి విసిరేశాడు. ఇదంతా గాలిలో మెలికలు తిరుగుతూనే సెకన్ల వ్యవధిలో చేయడం మ్యాచ్ కే హైలెట్ . నాలుగు రన్స్ సేవ్ చేసి అభిమానుల మనసులు గెలిచాడు.
Sanju samson you beauty…one of the best catch in history ??#bcci#icc pic.twitter.com/e6OGVnujP6
— Nishar (@nishar8686) February 3, 2020
