Sanju Samson: భారత జట్టులోకి శాంసన్ ఎంట్రీ.. మ్యాచ్ కు ముందే నెక్స్ట్ లెవల్ క్రేజ్! 

Sanju Samson: భారత జట్టులోకి శాంసన్ ఎంట్రీ.. మ్యాచ్ కు ముందే నెక్స్ట్ లెవల్ క్రేజ్! 

Sanju Samson: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో  భారత ప్లేయింగ్– 11లోకి సంజు శాంసన్ రావడంలో దాదాపు ఫిక్స్ అయింది. దశాబ్ధాకాలంగా జట్టులోకి వచ్చిపోతున్న ఈ కేరళ కుర్రాడికి అరుదుగా అవకాశాలు లభిస్తుంటాయి. అనుభవం ఉన్నప్పటికీ జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా పాతుకుపోవడంలో విఫలమయ్యాడు. ఎప్పుడూ లేని విధంగా సంజూ ఈసారి టీమిండియాలోకి వస్తుంటే భారీ హైప్ కొనసాగుతుంది. మ్యాచ్ ఆడకుండానే అభిమానులు శాంసన్ ను తుది జట్టులో ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ సంజుకి ఇంతలా క్రేజ్ రావడానికి  కారణమేంటో తెలుసా?..  

ఐపీఎల్–2026 రిటెన్షన్ కి ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ ని చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ ద్వారా తమ జట్టులోకి తీసుకుంది. ఇందుకోసం అతడికి రూ.18 కోట్ల చెల్లిస్తుంది. ఇక సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరన్ లను రాజస్థాన్ కు పంపించింది. శాంసన్ చెన్నై జట్టులోకి రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలే గత సీజన్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన డాడీస్ జట్టులోకి శాంసన్ లాంటి స్టార్ చేరడంతో ఆ టీమ్ అభిమానులు శాంసన్ ను త్వరగా తమ జట్టులో చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇంకా CSK జట్టు తరపున ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఈ కేరళ కుర్రాడికి ఫ్యానిజం చేస్తున్నారు. 

మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందే శాంసన్ ను చూసే అదృష్టం చెన్నై అభిమానులకి కలగనుంది. వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా ఇండియా ఈరోజు జింబాబ్వేపై ఆడుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో శాంసన్ ఆడడం దాదాపుగా కన్ఫర్మ్ కావడం.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోవడంతో ఓపెనర్ గా సంజూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరూ జట్టులో ఉన్నప్పటికీ రింకూ సింగ్ స్థానంలో శాంసన్ ప్లేయింగ్ 11లోకి వచ్చే ఉంది. ఎలా చూసుకున్నా ఈరోజు జరిగే మ్యాచ్ లో సంజు ఆడడం ఫిక్స్ అనుకోండి. అంతేకాదు మ్యాచ్ కు ముందు ఈ కేరళ స్టార్ నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. 
 
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. శాంసన్ లాంటి స్టార్ క్రికెటర్ చేరితే ఫ్యాన్స్ నుంచి ఆ వెల్కమ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఐపీఎల్ కు ముందే జింబాబ్వేతో జరగనున్న ఈ మ్యాచ్ లో శాంసన్ కు ఈ గ్రాండ్ వెల్కమ్ లభించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువగా శాంసన్ ను సపోర్ట్ చేయడానికి తమిళ తంబిలు రానున్నట్టు సమాచారం. 

ఈ వరల్డ్ కప్ టోర్నీలో సంజు శాంసన్ కు ఒకే మ్యాచ్ లో ఆడే ఛాన్స్ దొరికింది. లీగ్ స్టేజ్ లో నమీబియాతో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ తో కలిసి శాంసన్ ఓపెనింగ్ కి వచ్చాడు. జ్వరంతో అభిషేక్ ఆ మ్యాచ్ లో ఆడలేదు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన శాంసన్ నమీబియాపై 7 బంతుల్లోనే 3 సిక్సర్లతో 22 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత శాంసన్ స్థానంలో అభిషేక్ తుది జట్టులోకి వచ్చాడు. దీంతో ఆ తర్వాత టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ ల్లో అతడు బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక సూపర్-8లో భాగంగా మరోసారి జింబాబ్వేపై జరగనున్న కీలక మ్యాచ్ లో బరిలోకి దిగనున్న శాంసన్ సీఎస్కే అభిమానుల అంచనాలను రిచ్ అవుతాడో లేదో చూద్దాం..