ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల కోసం సికింద్రాబాద్(జేబీఎస్)- కరీంనగర్ మధ్య శనివారం నుంచి 20వ తేదీ వరకు వరకు 830 ట్రిప్పుల బస్సులు నడపనున్నట్లు కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఖుస్రో షా ఖాన్ తెలిపారు. ఏపీ నుంచి కరీంనగర్ కు మరొక 15 బస్సులు,  బెంగళూరు నుంచి కూడా అవసరం మేరకు బస్సులు నడిపిస్తామని చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 

తెలుగువారి పండుగలలో సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రజలు బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదునుగా భావించే ప్రైవేట్ వాహనదారులు అడ్డగోలుగా దోచుకోకుండా ఉండేందుకు రద్దీ రూట్లల్లో ఆర్టీసీ బస్సులనుఅధికారులు ఏర్పాట్లుచేశారు.