సంక్రాంతి ముగ్గు.. సీఎం రేవంత్ ముఖాకృతి ..అభిమానాన్ని చాటుకున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత

సంక్రాంతి ముగ్గు.. సీఎం రేవంత్ ముఖాకృతి ..అభిమానాన్ని చాటుకున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత

సంక్రాంతి  సందర్భంగా సీఎం రేవంత్‌  కాంగ్రెస్ నేత వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన గోగురు శ్రీనివాస్ రెడ్డి, రజిత దంపతులు పండగ రోజున బుధవారం తమ ఇంటి ముందు  రేవంత్ ముఖాకృతితో ముగ్గు వేశారు.  ఆర్టిస్టు అనిల్ సాయంతో ముగ్గును వేసినట్టు కాంగ్రెస్ నేత  తెలిపారు. సీఎంపై  అభిమానాన్ని చూటుకున్న దంపతులను పలువురు కాంగ్రెస్ నేతలు అభినందించారు.