సంక్రాంతి స్పెషల్ : వందే భారత్ రైళ్లలో పెరిగిన బోగీలు

సంక్రాంతి స్పెషల్ : వందే భారత్ రైళ్లలో పెరిగిన బోగీలు

 సంక్రాంతి పండుగ సందర్భంగా వందే భారత్ రైళ్లకు మస్తు డిమాండ్ ఉంటుంది. సమయం దృష్ట్యా త్వరగా వెళ్లాలనుకునే ప్రయాణికులు వందేభారత్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీంతో  పండుగకి వీటికి  ఫుల్ డిమాండ్ పెరుగుతుంది.  ఈ క్రమంలో రద్దీకి తగ్గట్టు సంక్రాంతికి వందేభారత్ కోచ్ లు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  అంతేగాకుండా రద్దీ దృష్ట్యా పండుగకి దక్షిణమధ్య రైల్వేలో 115 స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని తెలిపింది.  సికింద్రాబాద్ మెయిన్ జంక్షన్ లో పండుగ సందర్భంగా అడిషనల్ స్టాఫ్ తో సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. 

సికింద్రాబాద్,హైదరాబాద్, లింగంపల్లి, కాచిగూడ, ప్రధాన రైల్వే స్టేషన్స్ నుంచి  స్సెషల్ రైళ్లు నడవనున్నాయి.  జనవరి 7 నుంచి 20 వరకు  సౌత్ సెంట్రల్ పరిధిలో ఈ రైళ్లు నడుస్తాయి. ఇప్పటికే ట్రైన్లలో  విపరీతమైన వెయిటింగ్ లిస్ట్ ఉంది.   స్పెషల్ ట్రైన్స్ కాకుండా 470 రైళ్లు జనవరి మొత్తం నడవనున్నాయి. ఇవి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్తాయి.  అయితే స్పెషల్ రైళ్లలో అదనపు చార్జీలు ఉంటాయి. 

ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, నర్సాపూర్,తిరుపతి వంటి ప్రధాన రూట్లలో ఫెస్టివల్ డిమాండ్ ను బట్టి ట్రైన్లను ఆపరేట్ చేయనున్నారు.  ఎంటీఎస్ వెబ్ సైట్, యూటీస్ మొబైల్ యాప్ ద్వారా ట్రైన్స్ టికెట్స్  అందుబాటులో ఉండనున్నాయి.