‘సంతూర్’ వుమెన్స్ స్కాలర్‌‌ షిప్స్ ఇస్తున్నరు…

‘సంతూర్’ వుమెన్స్ స్కాలర్‌‌ షిప్స్ ఇస్తున్నరు…

ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత విద్య కొనసాగించలేని బాలికలకు సంతూర్, విప్రో క న్స్యూమర్ కేర్ ఆర్థిక సాయం అందిస్తున్నాయి. సంతూర్ వుమెన్స్ స్కాలర్‌‌షిప్‌ ల పేరిట అందించే ఈ ఉపకార వేతనాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణా టక రాష్ర్టా లకు చెంది నవారు మాత్రమే అర్హులు. సెలెక్ట్ అయితే ఏడాదికి 24 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. వెబ్‌ సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నిం పి బెంగళూరులోని విప్రోకేర్స్ సంస్థకు గడువుతేదీలోగా పంపాలి. ఆన్‌‌లైన్‌‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: పదోతరగతి, ఇంటర్ ప్రభుత్వ పాఠశాల/ కళాశాలలో చదివి 2019–20 లో ఏదైనా డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన వారు ఇందుకు అర్హులు. ఇంటర్ ఈ ఏడాది ఉత్తీర్ణులై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

స్కాలర్‌‌షిప్
మొత్తం 900 స్కాలర్‌‌షిప్‌ లున్నాయి. ఎంపికయిన వారికి కోర్సు పూర్తయ్యే వరకు ఏడాదికి రూ.24000 అందిస్తారు. ఆధార్ కార్డు, టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్‌‌లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు (పాస్‌ బుక్ మొదటి రెండు పేజీలు), పాస్‌ పోర్ట్ ఫోటో దరఖాస్తుకు జత చేయాలి. గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ను అనుమతించరు. 2016–17 లో ప్రవేశపెట్టిన ఈ స్కాలర్‌‌షిప్‌ ల ద్వారా ఇప్పటివరకు 2700 మందికి ఉపకార వేతనాలు అందించారు.

దరఖాస్తుకు చివరితేది: 2019 ఆగ స్టు 15

చిరునామా: Wipro Cares– Santoor

Scholarship, Doddakannelli, Sarjapur

Road, Bangalore–560 035, Karnataka.

వెబ్‌ సైట్: www.santoorscholarships.com