
తనపై వస్తున్న ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేశారు బాలీవుడ్ బ్యూటీ సారా ఆలీ ఖాన్. గత కొంత కాలంగా సారాపై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది. దానికి కారణం.. ఈ మధ్య ఆమె ఎక్కువ దేవాలయాలకు వెళ్తుండటమే. "ఒక ముస్లిం అయ్యుండి దేవాలయాలకు వెళ్లడం ఏంటని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్.
ఈ ట్రోలింగ్స్ పై తాజాగా స్పందించారు సారా అలీ ఖాన్.. "మీరు చేస్తున్న ట్రోలింగ్.. నా భక్తిని వ్యక్తపరచకుండా ఆపలేదు. నేను ఆలయాలకు వెళ్లడం మీకు నచ్చితే ఓకే.. నచ్చక పోయినా వెళ్లడం మానను. అది నా వ్యక్తిగత విషయం" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సారా ఆలి ఖాన్.
ప్రస్తుతం సారా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సారా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె.. ఫక్రే అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.