
ఐపీఎల్ 2023 లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్ చేరాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలపై గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ బ్యాట్స్మెన్ శుభమాన్ గిల్ నీళ్లు చల్లాడు. శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్; 52 బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ తో చెలరేగడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ముంబై జట్టు నేరుగా ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ శుభ్‌మాన్ గిల్‌కు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలుపుతున్నారు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో సారా టెండూల్కర్ ఫ్యాన్ పేజీ లో శుభ్‌మాన్ గిల్‌కు ధన్యవాదాలు తెలిపుతూ ఓ పోస్ట్ కూడా ఉండటంతో సారా టెండూల్కర్ హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
సారా టెండూల్కర్ తో శుభమాన్ గిల్ డేటింగ్ చేశాడన్న రూమర్లను గుర్తు చేస్తూ ముంబైను గెలిపించావ్.. సారాను పెళ్లి చేసుకో.. ఇదే మేము నీకు ఇచ్చే గిప్ట్ .. క్రికెట్ దేవుడికి నువ్వే సరైన అల్లుడివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో శుభమాన్ గిల్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడని సచిన్ టెండూల్కర్ కూడా అతన్ని అభినందించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఆ తరువాత బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది.