
మల్హర్, (మహాదేవపూర్) వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పరిశీలించారు. కాళేశ్వరం ఆలయం పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లలో భక్తుల రద్దీ తదితర వివరాలను ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, సరస్వతి మెయిన్ పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కరాలకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భక్తులు హాజరువుతారని, భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐజీకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఏఆర్ ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం, భూపాలపల్లి, డీఎస్పీలు రామ్మోహన్ రెడ్డి, సంపత్ రావు, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మహాదేవపూర్ సీఐ రాంచందర్ రావు, కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి ఉన్నారు