18 పేజెస్ లో సరయు

18 పేజెస్ లో సరయు

వెబ్ సిరీస్‌‌‌‌లతో సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న సరయు.. ‘18 పేజెస్’. చిత్రంతో సిల్వర్ స్ర్కీన్‌‌‌‌పై కనిపించింది. నిఖిల్, అనుపమ జంటగా సూర్య ప్రతాప్ రూపొందించిన ఈ చిత్రం రీసెంట్‌‌‌‌గా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సరయు మాట్లాడుతూ ‘ఫస్ట్ సినిమానే గీతా ఆర్ట్స్‌‌‌‌లో నటించడం హ్యాపీ. నిఖిల్‌‌‌‌తో వర్క్ చేయడం గ్రేట్ఎక్స్‌‌‌‌పీరియెన్స్. 

నిఖిల్ చాలా సపోర్ట్ చేశారు. బాగి రోల్ చేసినప్పుడు ఎక్సయిట్ అయ్యాను. సినిమా మొత్తం నా క్యారెక్టర్ ఉంటుంది. సూర్య ప్రతాప్ సినిమాను పొయిటిక్‌‌‌‌గా చూపించారు. ఒరిజినల్‌‌‌‌గా నేను చాలా సాఫ్ట్. క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను అడాప్ట్ చేసుకుంటాను. రమ్యకృష్ణ గారంటే ఇష్టం. ఆవిడే నాకు ఇన్​స్పిరేషన్. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో ఆమె చేసినలాంటి రోల్స్ కొన్నైనా చేయాలనుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను’ అని చెప్పింది.