
కరీంనగర్ టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటించడంతో పాదయాత్రలు చేస్తున్న నాయకులకు భయం పట్టుకుందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. శనివారం కరీంనగర్ తారక్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడారు. తనకు నామినేటెడ్ పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి పనిచేస్తానని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని, దేశప్రజలు కేసీఆర్ ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. రెండు సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 9 ఎంపీ సీట్లున్న బీఆర్ఎస్ అధికారంలోకి ఎందుకు రాకూడదన్నారు.