పాక్ కంటే ఇండియానే స్ట్రాంగ్.. అందుకే గెలుస్తోంది : సర్ఫరాజ్

పాక్ కంటే ఇండియానే స్ట్రాంగ్.. అందుకే గెలుస్తోంది : సర్ఫరాజ్

ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత మీడియాతో పాక్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడారు. ఇండియా-పాక్ శతృత్వం మీపై ప్రభావం చూపిస్తోందా అని అడిగినప్పుడు… “రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే ఒత్తిడి ఉంటుంది. ఇండియా ఆ ఒత్తిడిని అధిగమించింది కాబట్టే గెలిచింది” అన్నాడు. అప్పట్లో పాక్ క్రికెట్ టీమ్ చాలా బలంగా ఉండేది కదా.. అప్పుడు కూడా ఎందుకు ఓడిందంటారు అని అడిగినప్పుడు… అప్పట్లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చాలా టఫ్ గా ఉండేది.. కానీ.. ఇండియా టీమ్ అంతకంటే స్ట్రాంగ్ గా ఉండేది కాబట్టే ఆ జట్టు అప్పర్ హ్యాండ్ సాధించేది అన్నాడు సర్ఫరాజ్.