రంజి ట్రోఫీలో సర్ఫరాజ్ డబుల్ సెంచరీ

రంజి ట్రోఫీలో సర్ఫరాజ్ డబుల్ సెంచరీ

హైదరాబాద్, వెలుగు: డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న  రంజీ టోరఫీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్ఫరాజ్ (227) డబుల్  సెంచరీతో విరుచుకుపడ్డాడు. దాంతో  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై 123.2 ఓవర్లలో 560 రన్స్ భారీ స్కోరుకు ఆలౌటైంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు  332/4తో రెండో రోజు, శుక్రవారం ఆట కొనసాగించిన ముంబైని సర్ఫరాజ్ ముందుకు తీసుకెళ్లాడు.  సువేద్ పార్కర్ (75) కూడా రాణించాడు హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి నాలుగు, రోహిత్ రాయుడు రెండు వికెట్లు తీశారు.  అనంతరం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో రోజు చివరకు 138/2 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (4), అమన్ రావు (7) ఫెయిలైనా.. రాహుల్ సింగ్ (82 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కె. హిమతేజ (40 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అజేయంగా 100 రన్స్ జోడించి దీటుగా బదులిచ్చారు. ముంబై స్కోరుకు హైదరాబాద్ ఇంకా 422 రన్స్ వెనుకంజలో ఉంది. 

గిల్ మళ్లీ ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పంజాబ్ చిత్తు

టీమిండియా వన్డే కెప్టెన్, పంజాబ్ స్టార్ బ్యాటర్ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (14) మరోసారి నిరాశపరచడంతో రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన గ్రూప్–-బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ జట్టు 194  రన్స్ తేడాతో సౌరాష్ట్ర  చేతిలో చిత్తయింది. రెండో రోజు ముగిసిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌరాష్ట్ర ఇచ్చిన 320 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ 125 పరుగులకే ఆలౌటైంది.