టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కోయగూడెం సర్పంచ్ అభ్యర్థి పూనెం కరుణాకర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు సర్పంచ్ అభ్యర్థి పూనెం కరుణాకర్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మండలంలోని చుక్కలబోడు నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరుణాకర్ కోరారు.
