
గ్రామ పెద్దలు కుర్చీల్లో కూర్చుని, దళిత సర్పంచ్ ను కింద కూర్చోబెట్టి పంచాయతీ చేసిన ఘటనపై సర్కారు సీరియస్ అయింది. ‘పెద్దలదే పంచాయతీ’ హెడ్డింగ్ తో మంగళవారం ‘వెలుగు’లో ప్రచురితమైన కథనంపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లాలో ని కొడంగల్ నియోజకవర్గం పెదిరిపాడు గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఆరా తీశారు. వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో నారాయణపేట ఆర్డీవో శ్రీనివాస్ మంగళవారం ఊరికివెళ్లి సర్పంచ్ బాలప్ప, గ్రామస్తులతో మాట్లాడారు. సర్పంచ్ ను కింద కూర్చోబెట్టిన గ్రామ పెద్దలు అప్పటి కే పరారయ్యారు. దళిత సర్పంచ్ ను అవమానించారంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆర్డీవోతోపాటు కోస్గి సీఐ శ్రీనివాసరావు కూడా ఈ ఘటనపై విచారణ జరిపారు. తాను ఇష్టపూర్వకంగానే కింద కూర్చున్నానని వారికి బాలప్ప చెప్పి నట్టు సమాచారం. గ్రామ పెద్దలంతా రావడంతో కుర్చీలు సరిపోక తాను కింద కూర్చున్నానని అన్నట్టు తెలిసింది. అయితే గ్రామ పెద్దలుగా వ్యవహరించేవారికి భయపడే సర్పంచ్ బాలప్ప అలా చెప్పి ఉంటారని స్థా నికులు అంటున్నారు.
‘కుర్చీల్లో ఉన్నోళ్లంతా’ పరార్.
దళిత సర్పంచ్ ను అవమానిం చిన ఘటన కలకలం రేపడంతో ‘గ్రామ పెద్దలు’ పరారయ్యారు. మంగళవారం ఉదయం ప్రజాసంఘాల నేతల నిజ నిర్ధా రణ కమిటీ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించింది. మీడియా కూడా గ్రామానికి వెళ్లిం ది. గ్రామ పెద్దలను కలవడానికి ప్రయత్నిం చినా.. ఎవరూ ఊర్లో లేరనే సమాచారం వచ్చిం ది. దాదాపు ఊరు జనమంతా ఇళ్లలో నే ఉండి పోయారు. ఎవరూ బయటికి రాలేదు, వచ్చినా వివరాలూ చెప్పలేదు. ఈ ఘటనపై నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ ప్రజాసంఘాలతో మాట్లాడారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు డీఎస్పీని కోరారు.
కలెక్టరేట్ వద్ద ఆందోళన
దళిత సర్పంచ్ ను అవమానించిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజాసంఘాల నాయకులు మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గ్రామాల్లో ఇంకా పెత్తందార్ల మాటే నడుస్తోందని మండి పడ్డారు . కావాలనే బాలప్పను అవమానించారని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
అట్రాసిటీ కేసు పెట్టాలి
దళిత సర్పంచ్ ను అవమానించిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, గ్రామ పెద్దలుగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు బాలప్ప, కురుమన్న డిమాండ్ చేశారు. అధికారులు పట్టిం చుకోకపోవడంతో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, గ్రామ పెత్తందార్లయి న వెంకట్‍రెడ్డి , పాపిరెడ్డి , జనార్దన్‍రెడ్డి , మల్ రెడ్డి లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేటికీ గ్రామాల్లో కుల వివక్షను పాటించడం క్షమించరాని నేరమన్నారు. ఇప్పటి కైనా దళిత ప్రజాప్రతినిధి హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.