బీ ఫామ్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం

బీ ఫామ్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం

అయిజ, వెలుగు: అలంపూర్  సిట్టింగ్  ఎమ్మెల్యే అబ్రహం కు బీ ఫామ్  ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని నియోజకవర్గంలోని అన్ని మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్​ చైర్మన్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో అయిజ పీఏసీఎస్​  మాజీ చైర్మన్  సంకాపూర్ రాముడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

టికెట్  కేటాయించి బీ ఫామ్ ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. అభ్యర్థిని మార్చాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. క్యాండిడేట్​ను మార్చితే సహించేది లేదన్నారు.  కాశి పోగురాజు, సుగుణమ్మ, జయ చంద్రారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి,తనగల సీతారామి రెడ్డి, రంగు శ్రీధర్, మేకల నాగిరెడ్డి, రాణెమ్మ, భూషణం, ఉమేశ్​ గౌడ్  పాల్గొన్నారు.