పల్లె, పట్టణ ప్రగతి సదస్సును బహిష్కరించిన సర్పంచులు

పల్లె, పట్టణ ప్రగతి సదస్సును బహిష్కరించిన సర్పంచులు

నిర్మల్ పట్టణంలో  పల్లె,  పట్టణ ప్రగతి  అవగాహన సదస్సులో  ఆందోళనకు దిగారు సర్పంచులు.  దాదాపు 150  మంది సర్పంచులు  అవగాహన సదస్సును  బహిష్కరించి ధర్నా చేశారు.  ఈసారి  పల్లె ప్రగతి  ఏమో గానీ  గతంలో చేసిన  పనుల  పెండింగ్ నిధులే విడుదల  చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగులో  ఉన్న అన్ని  బిల్లులను చెల్లించాలని డిమాండ్  చేశారు. 
సదస్సును  బహిష్కరించి, ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. పంచాయతీలకు  కేంద్రం నేరుగా  నిధులు ఇవ్వడాన్ని  తప్పుబట్టిన  సీఎం కేసీఆర్  వైఖరిని ఖండించారు  సర్పంచులు. సర్పంచుల  పల్లె,  పట్టణ ప్రగతి  అవగాహన సదస్సుకు  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే  సర్పంచుల  ఆందోళనతో  సమావేశానికి ఆలస్యంగా  వచ్చారు మంత్రి. మంత్రి రాకతో స్థానిక టీఆర్ఎస్ నేతలు సర్పంచులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి కార్యక్రమానికి హాజరుకావాలని బ్రతిమిలాడారు. దీంతో శాంతించిన సర్పంచులు సమావేశానికి హాజరయ్యారు. 

 

ఇవి కూడా చదవండి

ఢిల్లీ ప్రభుత్వంపై కేసీఆర్ ప్రశంసలు

డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్

12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు