
జగిత్యాల టౌన్,వెలుగు: గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రాం జయంతి నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగ్జీవన్ రాం ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఏక గ్రీవ పంచాయతీలకు నజరానాలు ఇవ్వలేదన్నారు. అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్ రామని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ చైర్మన్ సిద్దేశ్వర్, పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, తాటిపర్తి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.